ఫార్మాసిటీ కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో కాలుష్య నిర్వహణ వైఫల్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించడంతో, పీసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 95 ఫార్మా పరిశ్రమలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యర్థజలాలను కాలువల్లోకి విడుదల చేయొద్దని, పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయాలని స్పష్టం చేశారు.