మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కోరిన సీఎం రేవంత్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందించి సముచితంగా గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు పునాదులు వేయడంతో పాటు, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ అభ్యర్థనను వెల్లడించినట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.