పరీక్షలు మీ విలువను నిర్ణయించలేవంటూ ఐఐటీ ఖరగ్పూర్ డైరెక్టర్ సూచన

రిపోర్టర్: విజయ్ స్థలం: పశ్చిమ బెంగాల్

ఐఐటీ ఖరగ్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక సందేశాన్నిస్తూ పరీక్షలు కేవలం ఒక రోజు ప్రతిభను మాత్రమే అంచనా వేస్తాయని, అంతేకానీ వారి భవిష్యత్తును లేదా విలువను నిర్ణయించలేవని స్పష్టం చేశారు. ఐఐటీ బొంబాయిలో విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో విద్యార్థులలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.