కడపలో హింసకు వైసీపీ ముందస్తు ఏర్పాట్లు: మంత్రి నారా లోకేశ్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కడప
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అయితే కడపలో మాత్రం హింసకు వైకాపా ముందస్తు ఏర్పాట్లతో వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అసాంఘిక శక్తులపై ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.