ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత షూటర్ల త్రయం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ఏషియన్ గేమ్స్ 2026 పోటీల్లో భారత షూటర్లు నీరజ్ కుమార్, రుద్రాక్ష్ పాటిల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తో అద్భుత ప్రతిభ కనబరిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఈ త్రయం మొత్తం 1762 పాయింట్లు సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా మొదటి స్థానంలో నిలవగా, భారత్ రజతంతో సరిపెట్టుకుంది. దక్షిణ కొరియా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.