దేశవ్యాప్తంగా వృద్ధులకు భరోసాగా

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశంలో డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మందికి పైగా వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ వయ వందనా కార్డు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా గొప్ప భరోసా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కులమతాలకు అతీతంగా సీనియర్ సిటిజెన్లందరికీ ఈ వైద్య రక్షణ కవచం అండగా నిలుస్తోందని అధికారికంగా వెల్లడించారు.