స్వయంగా ఫుట్‌పాత్ నిర్మించుకున్న బెంగళూరు సీఈఓ

రిపోర్టర్: మహేష్ స్థలం: కర్ణాటక

బెంగళూరులో అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్లుగా పాడైపోయిన ఫుట్‌పాత్‌ను ఓ సీఈఓ తన సొంత ఖర్చులతో బాగుచేయించారు. బీబీఎంపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో సిద్దార్థ్ దిలానీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ రూ.2,700 వెచ్చించి మరమ్మతులు చేయించారు. సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం రాంప్ కూడా నిర్మించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, పౌర సమస్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.