తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ సెప్టెంబర్ 19న జరగనుండటంతో దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. అలాగే భక్తుల సౌలభ్యం కోసం సెప్టెంబర్ 20న విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.