రాష్ట్రంలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా అంటూ కవిత ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభలో ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయం అంటే కేవలం బూతులు తిట్టుకోవడమేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు నీళ్లిచ్చే ఆలోచనే లేదని ఆరోపిస్తూ, రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని ఆమె హెచ్చరించారు.