స్థానిక సమరంలో నూటికి నూరు శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న టీడీపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గ్రీష్మా, పరిశీలకుడు దాడి రత్నాకర్, ఇన్ఛార్జి పడాల భూదేవి ఎన్నికల అభ్యర్థులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగకుండా పార్టీ విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు హితవు పలికారు.