ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన గుర్రం కేశవులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు ఢిల్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్లీలా మైదానంలో జరిగిన సభకు హాజరైన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.