కన్నేపల్లి వద్ద నీరు వృధా: ప్రభుత్వానికి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్

రిపోర్టర్: మహేష్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని కన్నేపల్లి వద్ద సాగునీరు వృధాగా పోతోందని జి. జగదీష్ రెడ్డి - ఎమ్మెల్యే సూర్యాపేట మండిపడ్డారు. ఈరోజు కూడా నీటి వృధా కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాధ్యత తమకు అప్పగిస్తే నీటిని సమర్థవంతంగా ఎత్తిపోసి చూపిస్తామని ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నీటి వృధాను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.