రామ్లీలా మైదాన్ ర్యాలీ: ఢిల్లీ వ్యాపార వర్గాలకు భారీ సంక్షోభ ముప్పు
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
రామ్లీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీ కారణంగా ఢిల్లీ వ్యాపార వర్గాలకు అపూర్వమైన సంక్షోభం ముంచుకొస్తుందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ హెచ్చరించారు. దీపావళి షాపింగ్ సీజన్ వేళ ఐదు కిలోమీటర్ల పరిధిలోని రెండున్నర లక్షల దుకాణాలు మూతపడే అవకాశం ఉందని, పది కిలోమీటర్ల మేర రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు.