ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 79 మంది, ఇంటర్మీడియట్ విద్య నుంచి 24 మందితో మొత్తం 103 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.