వైఎస్ వివేకా హత్య కేసు: ఈడీ ఎదుట విచారణకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా ఈడీ విచారణకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఈ కేసులో ఏఐ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి పాత్రపై, రూ.40 కోట్ల మూలాల గురించిన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. వివేకా హత్యకు సంబంధించిన నిధుల బదలాయింపు అంశాలపై ఈడీ లోతైన దర్యాప్తు వేగవంతం చేసింది.