దీపావళి వేళ పటాకుల ధరల మోత: పదిహేను శాతం వరకు పెంపు

రిపోర్టర్: శివ స్థలం: Cuttack

ముడి సరుకుల ధరలు పెరగడం మరియు రవాణా సమస్యల కారణంగా ఈసారి దీపావళికి పటాకుల ధరలు పదిహేను శాతం వరకు పెరుగుతాయని ఇండియన్ ఫైర్వర్క్స్ మ్యానుఫ్యాక్రర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.కన్నన్ వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం, పెట్రోలియం ఆధారిత ఉత్పత్తుల ధరల పెరుగుదల తయారీ ఖర్చులను భారీగా పెంచాయని ఆయన తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి సరఫరా కూడా తగ్గిందని, అయినప్పటికీ పండుగ వేళ వినియోగదారుల నుంచి డిమాండ్ మాత్రం తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు.