హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ సీజన్ 2లో కొత్త నటీనటులు

రిపోర్టర్: హరి స్థలం: World

ప్రముఖ హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం మేకర్స్ కసరత్తు మొదలుపెట్టారు. యంగ్ టామ్ రిడిల్‌గా బిల్లీ బారెట్, డోబీ పాత్రలో లెన్నీ రష్, గిన్నీ వీజ్లీగా బోనీ హిల్ ఎంపికయ్యారు. మొదటి సీజన్ ప్రసారానికి ముందే రెండో సీజన్ కోసం కొత్త నటీనటులను ప్రకటించడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. హెచ్‌బిఓ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.