ఎక్కువ సీట్లలో కాకుండా గెలిచే స్థానాలపై దృష్టి పెట్టాలి నాదెండ్ల మనోహర్
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశ పడకూడదని, కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేద్దామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు అనవసరమైన ఆశలకు పోకుండా వాస్తవ పరిస్థితులను బట్టి అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహాలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.