ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ అక్కాచెల్లెళ్ల అద్భుతమైన సైకత శిల్పం

రిపోర్టర్: శివ స్థలం: తూర్పుగోదావరి జిల్లా

స్థానిక సమరంలో ప్రలోభాలకు లోనుకాకుండా ప్రగతిశీలురకే ఓటు వేయాలని సందేశం ఇస్తూ అక్కాచెల్లెళ్లు సోహిత, ధన్యత సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ సహకారంతో వారు ఈ ఆకృతిని రూపొందించారు. జాతీయ పతాకంపై సిరా గుర్తున్న వేలిని చూపుతూ, మద్యం మరియు నగదు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, అర్హులను మాత్రమే గెలిపించాలని అందులో కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.