దేవరకొండలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ
రిపోర్టర్: రాము
స్థలం: దేవరకొండ
దేవరకొండ టౌన్ పరిధిలోని కొండ భీమనపల్లి చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్టియాన్ మావిలు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, లోతైన ప్రాంతాల వద్ద బారికేడ్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.