ఉద్యోగుల ఖాతాల్లోకి నేడే సెప్టెంబర్ నెల జీతాలు జమ చేస్తున్న కేంద్రం
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లను ముందుగానే నేడు అకౌంట్లలో జమ చేసేందుకు అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె కారణంగా లావాదేవీలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ముందస్తు చెల్లింపుల నిర్ణయం రక్షణ, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాలు సహా అన్ని రంగాల ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.