నిరుద్యోగులకు గుడ్ న్యూస్: అసిస్టెంట్ టీచర్ ప్రాథమిక పరీక్ష మార్కులు విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అసిస్టెంట్ టీచర్ ప్రాథమిక రిక్రూట్మెంట్ పరీక్ష మార్కులను విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ స్కోర్లను పరిశీలించుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. మొత్తం ఒక ఒక వంద అరవై తొమ్మిది ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షలకు ఎనభై మూడు వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల పందొమ్మిది నుంచి ముప్పై లోపు ఈ-డోస్పియర్లను సమర్పించాలని స్పష్టం చేశారు.