ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్వకుర్తి

భారతదేశం గర్వించదగిన తొలితరం ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా దేశంలోని ఇంజనీర్లందరికీ కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టితో దేశ అభివృద్ధికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన చూపిన బాటలో నేటి ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమంతో మేళవిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.