సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చకు తీవ్ర అస్వస్థత: పరిస్థితి విషమం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుపతి

సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు పొందిన అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ తీవ్ర అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. తిరుపతికి చెందిన కిరణ్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈ నెల ఐదవ తేదీన SVIMS ఆస్పత్రిలో చేర్పించామని, ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.