భక్తిపారవశ్యంతో పులకించిన విశ్వకర్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: U.Srinivasarao
స్థలం: కిర్లంపూడి
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొమ్ము సత్యనారాయణ, కిర్లంపూడి మండలం అధ్యక్షుడు గానుగుల శ్రీనివాసరావు, కార్యదర్శి కొత్తల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.