ఉపాధ్యాయులపై వైసిపి దాడి అరాచకానికి పరాకాష్టన్న గొల్ల నరసింహ యాదవ్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతిలో విజయవాడ శ్యాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసిపి గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ మండిపడ్డారు. డీఎస్సీపై ఆరోపణలు చేస్తూ ఉపాధ్యాయులపై భౌతిక దాడికి దిగడం వైసిపి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని, ఓడినా వారి అహంభావం పోలేదని ఆయన తిరుపతిలో విలేకరుల సమావేశంలో విమర్శించారు. బాధితులకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.