వైద్య విద్యార్థులకు అలర్ట్: నేటితో ముగియనున్న నీట్ యూజీ స్ట్రే వేకెన్సీ రిజిస్ట్రేషన్

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

వైద్య విద్య కోర్సుల ప్రవేశాల నిమిత్తం నిర్వహిస్తున్న నీట్ యూజీ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుందని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు మధ్యాహ్నం మూడు గంటలలోపు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ పదిహేడో తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడనున్నాయని, పందొమ్మిది నుంచి ఇరవై ఏడో తేదీలోగా కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.