సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్ ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: India

2015లో విడుదలైన 'హీరో' సినిమాలోని 'మైూన్ హూన్ హీరో తేరా' పాటకు సరైన క్రెడిట్స్ ఇవ్వలేదంటూ ప్రముఖ సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్‌పై మండిపడ్డారు. పాట రూపకర్తలను విస్మరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన విమర్శ సల్మాన్ ఖాన్ మీద కాదని, కేవలం నిర్మాణ సంస్థ సోషల్ మీడియా టీమ్‌పైనేనని ఆయన స్పష్టం చేశారు.