దేశ సాంకేతిక రంగంలో మైక్రో జీపీయూను అభివృద్ధి చేసిన ఐఐటీ దిల్లీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దేశ సాంకేతిక రంగంలో ఐఐటీ దిల్లీ సరికొత్త చరిత్ర సృష్టించిందని పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటివరకు పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన మైక్రో జీపీయూ టెక్నాలజీని స్వదేశీగా అభివృద్ధి చేసి సత్తా చాటామని వారు తెలిపారు. ప్రొఫెసర్లు జయదేవ, కౌశిక్ సాహా మార్గదర్శకత్వంలో విద్యార్థులు నమ్మి ఆకాశ్, ఎం. రవి తేజ ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. ఈ స్వదేశీ గ్రాఫిక్స్ చిప్ టెక్నాలజీ భవిష్యత్తులో ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని నిపుణులు స్పష్టం చేశారు.