దళిత సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన మాజీ సీఎం, కేసీఆర్ తక్షణమే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మోత్కూర్ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్రను విస్మరించరాదని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ హామీ ఇచ్చి ఆ తర్వాత దళితులను మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బాలరాజు గౌడ్ విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై జరిగిన ఘటనను మరువకముందే బీఆర్‌ఎస్‌లోనూ కుల అహంకార ధోరణులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. దళితుల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ వైఖరిలో పెద్దగా తేడా లేదని విమర్శించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయించారనే ఆరోపణలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడంతో పాటు యావత్ దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. దళితులను అవమానించే, అంటరానితన భావజాలాన్ని ప్రోత్సహించే చర్యలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండాగోని రామచంద్రు గౌడ్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, బద్దం నాగార్జున్ రెడ్డి, గడ్డం సోంనర్సయ్య, లెంకల వేణు, గణగాని నర్సింహా, గడ్డం లక్ష్మయ్య, కందుకూరి మురళి, దాచారం గ్రామశాఖ అధ్యక్షుడు సూరారం నవీన్, ఎస్‌కే సజీద్, ఎడ్ల భగవంత్, రంగారెడ్డి, జిట్టా లక్ష్మయ్య, కోమటి జనార్దన్, ఆలకుంట్ల రాజు, ఆలకుంట్ల నర్సింహా, కురిమెటి సైదులు, కురిమెటి విక్రమ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.