ఆరేళ్లకే కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించి రికార్డు సృష్టించిన యువతి.

రిపోర్టర్: మహేష్ స్థలం: Eluru

ఏలూరుకు చెందిన దామినీ సుధ మూడేళ్ల వయసు నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకొని, ఆరేళ్లకే బ్లాక్‌బెల్ట్‌ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 70కి పైగా పసిడి పతకాలు కైవసం చేసుకుంది. చదువుతో పాటు ఇతర కళల్లోనూ రాణిస్తున్న ఈ యువతి, కరాటే జడ్జిగా అర్హత సాధించి తోటి విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.