తిరుపతిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 65 ఫిర్యాదుల స్వీకరణ
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
అందిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో నిష్పాక్షికంగా విచారించి, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.