సౌదీ అరేబియాపై హౌతీల దాడులు పశ్చిమాసియాలో అమెరికా హైఅలర్ట్

రిపోర్టర్: శివ స్థలం: సౌదీ అరేబియా

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా మారడంతో అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు తాజా భద్రతా సూచనలు జారీ చేసింది. రియాద్‌లోని సున్నిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేయగా సౌదీ రక్షణ వ్యవస్థ వాటిని తిప్పికొట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ప్రయాణించే అమెరికా పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.