పిఠాపురంలో ఘనంగా SVK జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Pithapuram
పిఠాపురం కళాభారతిలో SVK జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.