భక్తిశ్రద్ధలతో ముగిసిన మనుబోలు చెర్లోపల్లి గణేశుని అన్నదాన వేడుక

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని మండపం వద్ద భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదం స్వీకరించారు.