తిరుమలలో వైభవంగా చక్రస్నానంతో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. వరాహస్వామి పుష్కరిణి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేద మంత్రోచ్ఛారణల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి, సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో జలప్రవేశం చేయించారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తిగా పరిసమాప్తం కానున్నాయి.