స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: sujith reddy స్థలం: తోటపల్లిగూడూరు

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మండపం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.