'మేఘాంశ్ నాకు తమ్ముడిలాంటి వాడు': హైదరాబాద్‌లో మంచు మనోజ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న 'ఆస్మాన్' సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు మంచు మనోజ్ శ్రీహరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మేఘాంశ్ తనకు తమ్ముడిలాంటి వాడని తెలిపారు. డైరెక్టర్ రామ్ నందన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ క్లీంకారా సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.