స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: అక్టోబర్ 19న నోటిఫికేషన్
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఈ మేరకు ఎంబీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వెలువడనుందని ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 23 చివరి తేదీ అని, నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి నవంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.