బాలల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపిన జడ్జి
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లిలో మిషన్ బాల సురక్ష శిక్షా న్యాయ 2026 కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణపై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల దిశానిర్దేశం చేశారు. పిల్లల్లో ప్రవర్తనా మార్పులను గమనిస్తూ, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.