వైద్య ఉద్యోగుల సమ్మె వాయిదా: చర్చలు సఫలమయ్యాక విధుల్లోకి చేరాలని నిర్ణయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: మంగళగిరి
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు జి.కోటేశ్వరరావు, ఎం.అజయ్ కుమార్ వెల్లడించారు. మంగళగిరిలో అధికారులతో జరిగిన చర్చల నేపథ్యంలో నాన్-ఫైనాన్షియల్ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి ఉద్యోగులందరూ విధులకు హాజరై ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.