భక్తిపారవశ్యంతో పులకించిన నగరిలో మిన్నంటిన గంగమ్మ జాతర సంబరాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో ప్రసిద్ధ గంగజాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఊరి సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో భాగంగా తలారి వీధిలోని గంగమ్మ ఆలయం వద్ద నిర్వాహకులు శోభాయాత్రగా గరిగ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. జాతర హద్దుల్లో ఉన్న ప్రతి ఇంటికి ఊరేగింపుగా విచ్చేసిన గరిగకు స్థానిక మహిళలు పసుపు కుంకుమల నీటితో మంగళ హారతులు పట్టి నైవేద్యాలు సమర్పించి బండారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు చిరంజీవి రెడ్డి, జ్యోతిరెడ్డి, మధన శ్రీనివాసన్, మణిగండ తదితరులు పాల్గొన్నారు.