సరిహద్దుల్లో మరోసారి భగ్గుమన్న వివాదం: కొఠియా గ్రామాల్లో ఏపీ ఎన్నికల ప్రక్రియ

రిపోర్టర్: గోపి స్థలం: సాలూరు

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసిందని సాలూరు తహసీల్దార్ సురేశ్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఈ సరిహద్దు ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, ఒడిశా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. అంగన్వాడీ భవనాల ధ్వంసం, అధికారులపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ గిరిజనులు తమ ఓటు హక్కును ధైర్యంగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.