'ఆందోళన చెందాల్సిన అవసరం లేదు': ఏపీ హోంమంత్రి అనిత ఆరోగ్య పరీక్షలపై స్పష్టత

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు వైద్యులు పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బిజీ షెడ్యూల్ కారణంగా సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్లు పేషీ అధికారులు స్పష్టం చేశారు. హోంమంత్రి ఆరోగ్యం సంపూర్ణంగా ఉందని, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఎలాంటి ఊహాగానాలు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల అనంతరం ఆమె తిరిగి అధికారిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతారని అధికారులు వెల్లడించారు.