ట్రంప్ రిఫ్లెక్టింగ్ పూల్ మరమ్మతులకు భారీగా పెరిగిన ఖర్చు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో లింకన్ రిఫ్లెక్టింగ్ పూల్ మరమ్మతుల వ్యయం భారీగా పెరుగుతోంది. కొత్తగా మరో ఆరు లక్షల డాలర్ల రిపేర్ బిల్లు వచ్చిపడింది. వాల్వ్స్ మార్పు, ఇతర పనులతో ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 15 మిలియన్ డాలర్లకు చేరింది. కాన్‌స్టిట్యూషన్ గార్డెన్స్ లేక్ శుభ్రత కోసం మరో నాలుగు లక్షల డాలర్ల కాంట్రాక్ట్ కేటాయించారు.