ఢిల్లీ అత్యాచార నిందితుడి అరెస్ట్: యూఏఈ నుండి భారత్ కు రప్పించిన సీబీఐ

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

ఢిల్లీలో యువతిపై అత్యాచారానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన రెడ్ నోటీస్ నిందితుడు సజీర్ పల్లి మూప్పమ్ను యూఏఈ నుండి సీబీఐ విజయవంతంగా భారత్ కు రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఇంటర్పోల్ సహాయంతో ఈ చర్య చేపట్టారు. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయపరమైన విచారణ వేగవంతం చేశామని అధికారులు స్పష్టం చేశారు.