వైద్యశాలలో పెన్షనర్ల ఇబ్బట్లపై సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేత
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను TAPRPA ప్రతినిధులు సూపరింటెండెంట్ నరేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. బీపీ, ప్రోస్టేట్ మందుల కొరత, స్పెషలిస్ట్ వైద్యుల సమస్యలను వివరించారు. స్పందించిన నరేంద్ర, మందులు తెప్పిస్తామని, వెల్నెస్ సెంటర్లో స్పెషలిస్టులను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈసీజీ, ఇతర పరీక్షలకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అనంతరం మెమోరాండం సమర్పించారు.