వీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురు గల్లీలో వీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు పాల్గొని గణనాథుడికి అభిషేకాలు చేశారు. పూజల అనంతరం గుండు మధుసూదన్ కుటుంబం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.