రాష్ట్రస్థాయి పరుగు పందెంలో కాంస్య పతకంతో మెరిసిన గణేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాగర్ కర్నూల్
ఖమ్మం వేదికగా జరిగిన డెబ్బైవ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో నాగర్‌కర్నూల్ విద్యార్థి బండారి గణేష్ అండర్ పదిహేడు విభాగం మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఈ విజయం సాధించిన గణేష్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్ ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థి అయిన గణేష్ ప్రతిభను అందరూ ప్రశంసించారు.