పీఏసీఎస్ బలోపేతానికి సకాలంలో రుణాలు చెల్లించాలన్న లక్ష్మారెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు(ఎం)

రైతులు, వ్యాపారులు తీసుకున్న పంట రుణాలు, ఇతర రుణాలను సకాలంలో వడ్డీలతో సహా చెల్లించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని పీఏసీఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం జరిగిన 51వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగరాజుపల్లిలో పెట్రోల్ బంకు ప్రారంభం, సర్వేపల్లిలో గోదాం నిర్మాణ విషయాలను వివరించారు.